ఆలోచనను మించిన ఆయుదం లేదు
ఆలోచనతోనే ఏ కార్యమైనా ప్రారంభమౌతుంది
ఆలోచనలతోనే ఎన్నో కార్యాలు సాగుతున్నాయి
ఆలోచన కార్యాన్ని నడిపించే ఇంధనం
ఆలోచనలతో కార్యాలను నడిపించేది ఇంధనం
ఆలోచనలలో ఇమిడియున్న భావ తత్త్వాలు కార్యాల విధానాన్ని తెలుపుతాయి
ఆలోచనలతో సాగుతున్న ప్రక్రియలు కార్యాచరణగా పరిణామాన్ని తెలుపుతాయి
ఆలోచన విధానాన్ని మార్చే శక్తి పరిస్థితులకు ఉంటుంది
పరిస్థితుల ప్రభావాలు ఆలోచనలలో మార్పును కలిగిస్తూ అప్రమత్తం చేస్తాయి
ఆలోచనల అర్థాలు అజ్ఞాన విజ్ఞానాలతో కూడుకొని ఉంటాయి
అజ్ఞాన విజ్ఞాన అర్థాలను గుర్తించే ఆలోచన ఎరుకకు ఉంటుంది
No comments:
Post a Comment