Wednesday, January 17, 2024

ప్రతి క్షణంలోను అజ్ఞానం విజ్ఞానం కలిగి ఉంటుంది

ప్రతి క్షణంలోను అజ్ఞానం విజ్ఞానం కలిగి ఉంటుంది 

ప్రకటి క్షణాన్ని విజ్ఞానంగా మార్చుటకు ప్రయత్నిస్తూ కార్యాలను సాగించాలి 

కార్యాలు కూడా అజ్ఞానంగా విజ్ఞానంగా సాగుతుంటాయి 

కార్యాలను కూడా అజ్ఞానంగా విజ్ఞానంగా సాగించవచ్చు 

విజ్ఞాన కార్యాలను సాగించడానికి మేధాశక్తిని ఉపయోగించాలి 

విజ్ఞాన కార్యాలు ప్రశాంతంగా శాంతియుతంగా ఉంటాయి 

వ్యాయామం మించిన వైద్యం లేదు

వ్యాయామం మించిన వైద్యం లేదు 
యోగను మించిన చికిత్స లేదు 
ధ్యానం మించిన ప్రక్రియ లేదు 

ఆరోగ్యం మించిన ఐశ్వర్యం లేదు 

నడకను మించిన స్వక్రియ లేదు 
ఏకాగ్రతను మించిన ఆత్మీయత లేదు 
పరమార్థాన్ని మించిన పరిశోధన లేదు 

అవగాహనను మించిన పరమార్థం లేదు

అవగాహనను మించిన పరమార్థం లేదు 
పరమార్థాన్ని మించిన ప్రజ్ఞానం లేదు 

ఎరుకను మించిన అవగాహన లేదు 
జ్ఞాపకాన్ని మించిన విజ్ఞానం లేదు 

ఆలోచనను మించిన ఆయుదం లేదు

ఆలోచనను మించిన ఆయుదం లేదు 
ఆలోచనతోనే ఏ కార్యమైనా ప్రారంభమౌతుంది 
ఆలోచనలతోనే ఎన్నో కార్యాలు సాగుతున్నాయి 

ఆలోచన కార్యాన్ని నడిపించే ఇంధనం 
ఆలోచనలతో కార్యాలను నడిపించేది ఇంధనం 

ఆలోచనలలో ఇమిడియున్న భావ తత్త్వాలు కార్యాల విధానాన్ని తెలుపుతాయి 
ఆలోచనలతో సాగుతున్న ప్రక్రియలు కార్యాచరణగా పరిణామాన్ని తెలుపుతాయి 

ఆలోచన విధానాన్ని మార్చే శక్తి పరిస్థితులకు ఉంటుంది 

పరిస్థితుల ప్రభావాలు ఆలోచనలలో మార్పును కలిగిస్తూ అప్రమత్తం చేస్తాయి 

ఆలోచనల అర్థాలు అజ్ఞాన విజ్ఞానాలతో కూడుకొని ఉంటాయి 
అజ్ఞాన విజ్ఞాన అర్థాలను గుర్తించే ఆలోచన ఎరుకకు ఉంటుంది