Friday, March 1, 2024

ఖర్చు ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా

ఖర్చు ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా ఎందుకైనా ఎవరితోనైనా ఎప్పటికైనా ఎంతవరకైనా ఎన్నిరకాలైనా ఎన్నిసార్లైనా చేయగలవారు ఉంటారు కాని పొదుపు చేసేవారు అరుదుగా అక్కడక్కడ ఎప్పటికో కొందరికో కనిపిస్తూ ఉంటారు 

Monday, February 12, 2024

విశ్వం ఎంతో అద్భుతమైన ఆకారాలతో నిలయమైనను జీవుల జీవితాలన్నీ వికారాలతో సాగిపోతున్నది

విశ్వం ఎంతో అద్భుతమైన ఆకారాలతో నిలయమైనను జీవుల జీవితాలన్నీ వికారాలతో సాగిపోతున్నది  

ఓడిపోవడం కూడా గెలిపించడమే - ఓడిపోవడం తెలుసుకోవాలి గెలవడం నేర్చుకోవాలి

ఓడిపోవడం కూడా గెలిపించడమే (యుద్ధంలో ఓడిపోయేవారు లేకపోతే గెలవడం అనేది ఉండదు)

గెలిచిన వారందరు ఒకరిని ఓడించకపోవచ్చు కాని కొందరు ఒకరిని గెలిపించడం కోసం ఓడిపోతుంటారు. 

గెలిచిన వారి స్థితి కన్నా ఓడిపోయిన వారి స్థితి చాలా గొప్పది అభినందనీయమైనది.  

ఓడిపోవడం తెలుసుకోవాలి గెలవడం నేర్చుకోవాలి.  
  

సైనికుడు గొప్పవాడైతే ఎటువంటి యుద్దాన్నైనా గెలవవచ్చు

సైనికుడు గొప్పవాడైతే (సమర్థవంతుడైతే) ఎటువంటి యుద్దాన్నైనా (అవలీలగా) గెలవవచ్చు.  

సైనికుడు తన సామర్త్యాన్ని గెలిపించుకుంటే యుద్ధంలో తను గెలిచినట్టే మరియు యుద్ధాన్ని గెలిపించినట్టే.  

యుద్ధం విజయవంతమైతే సైనికుడు (ప్రతి సైనికుడు) గెలిచినట్టే. 

Sunday, February 11, 2024

పురుషుడు ఆయుధంలా స్త్రీ ఆభరణంలా జీవన విధానం

పురుషుడు ఆయుధంలా స్త్రీ ఆభరణంలా జీవన విధానం 
ఆయుధం ఆభరణానానికి రక్షణలా సహ జీవిత విధానం   

Wednesday, January 17, 2024

ప్రతి క్షణంలోను అజ్ఞానం విజ్ఞానం కలిగి ఉంటుంది

ప్రతి క్షణంలోను అజ్ఞానం విజ్ఞానం కలిగి ఉంటుంది 

ప్రకటి క్షణాన్ని విజ్ఞానంగా మార్చుటకు ప్రయత్నిస్తూ కార్యాలను సాగించాలి 

కార్యాలు కూడా అజ్ఞానంగా విజ్ఞానంగా సాగుతుంటాయి 

కార్యాలను కూడా అజ్ఞానంగా విజ్ఞానంగా సాగించవచ్చు 

విజ్ఞాన కార్యాలను సాగించడానికి మేధాశక్తిని ఉపయోగించాలి 

విజ్ఞాన కార్యాలు ప్రశాంతంగా శాంతియుతంగా ఉంటాయి 

వ్యాయామం మించిన వైద్యం లేదు

వ్యాయామం మించిన వైద్యం లేదు 
యోగను మించిన చికిత్స లేదు 
ధ్యానం మించిన ప్రక్రియ లేదు 

ఆరోగ్యం మించిన ఐశ్వర్యం లేదు 

నడకను మించిన స్వక్రియ లేదు 
ఏకాగ్రతను మించిన ఆత్మీయత లేదు 
పరమార్థాన్ని మించిన పరిశోధన లేదు